|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 02:18 PM
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో శుక్రవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ చూపిన ధైర్యసాహసాలు, త్యాగాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. యువత ఆయన ఆశయాలను అందిపుచ్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.