|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 12:38 PM
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా హర్టికల్చర్ అధికారి సుభాషిణి అన్నారు. పానగల్ రైతు వేదికలో నల్లగొండ మండలం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, పతంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్‌పామ్. అధిక ఆదాయాన్ని అందించే సులభతరమైన వాణిజ్య పంట అన్నారు. కార్యక్రమంలో పతాంజలి ఫుడ్స్ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, డీజీఎం యాదగిరి, జైన్ డ్రిప్ అగ్రోనమిస్టు శంకర్ మానె, హర్టికల్చర్ అధికారి అనంతరెడ్డి తదితరులు ఉన్నారు.