|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 12:07 PM
TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు స్పందించారు. రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు నోటీసులకు సమాధానం చెప్పడానికి సిద్ధమేనని, కానీ ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎంత మంది బీఆర్ఎస్ నాయకులను వేధించినా, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు సింహాల్లా గర్జిస్తారని తెలిపారు.