|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 12:06 PM
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలపై జరుగుతున్న దాడులు, ధ్వంస చర్యలను ఎన్ బి ఎం ఐ మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలు దేశద్రోహానికి సమానమని, అటువంటి దుండగులపై దేశద్రోహ చట్టం వర్తింపజేసి కఠిన శిక్షలు విధించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వంపై జరిగిన దాడిగా పరిగణించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు