|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:40 PM
‘రెబల్ స్టార్’ ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్‌గా ‘కల్కి 2’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈసారి ప్రభాస్ క్యారెక్టర్ మరింత గ్రావిటీ కలిగి ఉంటుందని, పార్ట్ వన్ రిలీజ్ సమయంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభించలేదు. అయితే తాజాగా దర్శకుడు సినిమా షెడ్యూల్‌ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలై, సమ్మర్ కాలంలో ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ముందుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో కీలక సన్నివేశాలు రూపొందించడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.తాజాగా ‘కల్కి 2’ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అద్భుతమైన అప్డేట్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “కల్కి 2 నా కెరీర్‌లో టాప్ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం అందించే సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మా టీమ్ ఇప్పటికే పార్ట్ 2 కోసం కష్టపడుతున్నది” అన్నారు. అలాగే త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉల్లాసంగా ఉన్నారు. సంతోష్ నారాయణన్ రూపొందిస్తున్న సంగీతం ఈసారి కూడా ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుందని అంచనా. అలాగే, దీపిక పదుకొనేని కల్కి 2లో తప్పించారని తెలిసిందే. ఆమె ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్‌ను ఎలా ప్లాన్ చేస్తున్నారు అనే ఆసక్తికర అంశం ప్రేక్షకులను మరింత ఎదురుచూస్తోంది.
Latest News