|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:47 AM
గతంలో తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు, 7జజీ బృందావన్ కాలనీ సినిమాలతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పర్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2011లో ధనుష్ హీరోగా, రీచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా తమిళంలో తెరకెక్కిన సినిమా ‘మయక్కమ్ ఎన్న’. ఈ చిత్రాన్ని 2016లో మిస్టర్ కార్తీక్ పేరుతో తెలుగులో రిలీజ్ చేయగా మంచి విజయం సాధించింది. ధనుష్ కెరీర్‌లో ఓ విభిన్న చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.కాగా జూలై 27న ధనుష్ బర్త్ డే సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మిస్టర్ కార్తీక్ సినిమాను థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులోకి తీసుకు వస్తున్నారు.
Latest News