|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:45 AM
మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించి, నిర్మించిన 'సితారే జమీన్ పర్' చిత్రం గత నెల 20న జనం ముందుకొచ్చింది. మానసిక దివ్యాంగులతో బాస్కెట్ బాల్ టీమ్ ను ఏర్పాటు చేసి వారిలోని అంతర్గత ప్రతిభను వెలికితీసే కోచ్ గా ఆమిర్ ఖాన్ అందులో నటించాడు. సరిగ్గా ఇది వచ్చిన నెల రోజులకే ఆటిజం నేపథ్యంలో అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'తన్వీ ది గ్రేట్' మూవీ విడుదలైంది. ఓ పక్క నూతన తారలతో మోహిత్ సూరి దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన 'సయారా' చిత్రం బాక్సాఫీస్ బరిలో చెలరేగిపోతుంటే... అనుపమ్ ఖేర్ 'తన్వీ' థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి.అనుపమ్ ఖేర్ చెల్లెలు ప్రియాంక పెద్ద కూతురు తన్వీ. ఆటిజం ఉన్న తన్వీకి సంగీతం, నటన అంటే ప్రాణం. ఎప్పటికైనా మ్యూజిక్ టీచర్, అలానే నటి అవ్వాలన్నది తన్వి డ్రీమ్. ఆమె జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని, 'తన్వి ది గ్రేట్' మూవీని అనుపమ్ ఖేర్ తెరకెక్కించారు. 2002లో 'ఓం జై జగదీశ్' తర్వాత అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. విడుదలకు ముందే ఈ సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. లండన్, న్యూయార్స్, హూస్టన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Latest News