|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 04:07 PM
హీరో శర్వానంద్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం 'బైకర్' కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. "ఇంజిన్ స్టార్ట్ అయింది. ట్రాక్ సిద్ధంగా ఉంది. ఇక అతడిని ఆపలేరు" అంటూ క్యాప్షన్ జోడించింది.వాస్తవానికి ఈ చిత్రాన్ని గత ఏడాది డిసెంబర్ 6న విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే, ప్రేక్షకులకు ఒక సాధారణ సినిమాను కాకుండా, మునుపెన్నడూ చూడని గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని 3D, 4DX వంటి అధునాతన ఫార్మాట్లలో కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Latest News