![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 02:21 PM
హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో అమానవీయ ఘటన జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ పట్ల వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నం చేయడంతో భయాందోళనకు గురైన బాధితురాలు కేకలు వేసింది. దీంతో సిబ్బంది, రోగి బంధువులు అప్రమత్తమై అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నల్లకుంట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.