|
|
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 12:47 PM
హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి దందా బయటపడింది. ఈగల్ టీమ్ ప్రత్యేకంగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో డ్రగ్ పెడ్లర్ సందీప్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతనితోపాటు మరో 15 మందిని పోలీసులు నేడు అరెస్ట్ చేసారు. 'బచ్చాఆగయా' అనే కోడ్ పేరుతో గంజాయి కొనుగోలుదారులతో వాట్సప్ లో గ్రూప్ క్రియేట్ చేసి కమ్యూనికేషన్ చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఐ గ్రూపులో 100 మందికి పైగా సభ్యులు ఉన్నారు. పోలీసులు వీరి అందరి వివరాలు సేకరిస్తున్నారు.ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే టార్గెట్ సాగుతున్న గంజాయి అక్రమ రవాణాను గ్యాంగ్ ను పట్టుకునేందుకు అధికారుల డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 15 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గంజాయి కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. వీరంతా సందీప్ ద్వారా డ్రగ్స్ కొంటున్నట్లు నిర్ధారణ అయ్యింది. గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.