|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 03:46 PM
మెగాస్టార్ చిరంజీవి, ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సోషియో-ఫాంటసీ సినిమా భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ఠ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వంభర టీజర్‌పై కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేశారని అన్నారు. అయితే, వారందరికీ ట్రైలర్‌తో గట్టి సమాధానం చెప్పబోతున్నట్లు వశిష్ఠ పేర్కొన్నారు. వశిష్ఠ మాట్లాడుతూ... "టీజర్ వచ్చినప్పుడు కొన్ని ట్రోల్స్ వచ్చాయి. కొందరు కావాలనే నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ, ట్రైలర్ చూశాక వాళ్లకు నోట మాట రాకపోవచ్చు. సినిమా అయితే అంచనాలకు మించి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్‌ను ఈ మూవీలో సరికొత్తగా చూస్తారు. ఇప్పటివరకు చూడని లుక్‌లో, మాయాజాలంతో కూడిన ప్రపంచంలో చూపించబోతున్నా. ప్రేక్షకులు ఊహించిన దానికన్నా ఎక్కువ మేజిక్ చేస్తా" అని అన్నారు.
Latest News