|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 09:17 PM
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ సినిమాల్లోకి రాబోతున్నారు. ఈ విషయాన్ని మోహన్‌లాల్ స్వయంగా ప్రకటించారు. ‘డియర్ మయాకుట్టి ‘తుడుక్కమ్’తో నీ మొదటి అడుగే కావచ్చు. కానీ జీవితాంతం సినిమాతో కొనసాగే బంధం’ అంటూ పేర్కొన్నారు. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరంబవూర్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
Latest News