|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 07:22 PM
హనురాఘవపూడి 'ఫౌజీ' సినిమా షూటింగ్ సమయంలో రెబల్‌స్టార్ ప్రభాస్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన షూటింగ్ కొనసాగిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. గత డిసెంబర్ నెలలో కూడా 'ఫౌజీ' షూటింగ్‌లోనే ప్రభాస్ కాలికి దెబ్బ తగిలింది. అప్పుడు షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చి ఇటలీ వెళ్లిన ఆయన, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల షూటింగ్‌లు కూడా ఆలస్యమయ్యాయి. పూర్తిగా కోలుకుని ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ప్రభాస్, 'ఫౌజీ' షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన నిరంతరాయంగా షూటింగ్‌లో పాల్గొంటుండగా, దురదృష్టవశాత్తు ఆయన కాలికి మళ్ళీ గాయమైనట్లు తెలుస్తోంది.
Latest News