![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:41 PM
బాలీవుడ్ నటి సనా ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి, శ్రీమతి సయీదా ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సనా ఖాన్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు."నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా ఖబ్రస్థాన్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. అమ్మ ఆత్మశాంతి కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాను" అంటూ సనా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు.ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు సనా ఖాన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమెకు మనోధైర్యాన్ని అందిస్తున్నారు.
Latest News