|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:29 PM
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ Aha మరో సరికొత్త వెబ్ సిరీస్ **“పోచమ్మ”**ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. మిస్టికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ‘మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది..’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటెన్స్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన ఈ గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. కొంతమంది నెటిజన్స్ అయితే ఈ కథను వెబ్ సిరీస్‌గా కాకుండా థియేటర్లలో సినిమా రూపంలో విడుదల చేయాలని కూడా సూచిస్తున్నారు. మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు డివైన్ కాన్సెప్ట్‌ను కలిపి రూపొందించిన ఈ సిరీస్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను Shruti Naidu తన శ్రుతి నాయుడు చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, స్ట్రీమింగ్ తేదీని Aha ప్రకటించనుంది.ఇక ప్రస్తుతం Ahaలో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా Sudigali Sudheer హోస్ట్‌గా నిర్వహిస్తున్న Sarkaar Season 6 మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో రెండు ఎపిసోడ్‌లు విడుదల కాగా, మూడో ఎపిసోడ్ మార్చి 13 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. సినిమాల విషయానికి వస్తే, Tharun Bhascker, Eesha Rebba జంటగా నటించిన Om Shanti Shanti Shantihi ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అలాగే Priya Bhavani Shankar నటించిన తమిళ్ చిత్రం Hot Spot కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Latest News