|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:15 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా రాబోతున్నధురంధర్ 2 చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా అయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1500 నుంచి రూ. 2000 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తే, ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణాది చిత్రాల ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగులుతుందని ఆయన జోస్యం చెప్పారు. ధురంధర్ 2 విజయం సాధిస్తే సౌత్ సినిమాలన్నీ పక్కకు వెళ్లిపోతాయని, దక్షిణాది చిత్రాలు ఇంకా పాత పద్ధతుల్లోనే రూపొందుతున్నాయి అని వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో కూడా 'ధురంధర్ 2'ను భారీగా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని వర్మ గుర్తుచేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. మొదటి భాగంలోని పాత్రలు, కథతో ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో కనెక్ట్ అయ్యారని, కాబట్టి రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని అన్నారు. మొదటి భాగం కంటే రెండో భాగమే ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు.
Latest News