|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:09 PM
అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్‌తో కలిసి నిర్మించిన 'అల్లు సినిమాస్' మల్టీప్లెక్స్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై థియేటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో తొలి, దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందుకుంది. థియేటర్ లోపల భారతీయ సినిమాకు చెందిన గొప్ప దర్శకులకు నివాళిగా 'వాల్ ఆఫ్ గ్రేట్స్' పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ గోడపై ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, వెట్రిమారన్, ప్రశాంత్ నీల్, రాజ్‌కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకుల చిత్రాలను ప్రదర్శించారు. అయితే, ఈ జాబితాలో భారతీయ కమర్షియల్ సినిమా రూపురేఖలు మార్చిన శంకర్, రామ్ గోపాల్ వర్మ , ముఖ్యంగా తెలుగు సినిమా లెజెండరీ దర్శకులైన కె.వి. రెడ్డి, కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు, కోదండరామిరెడ్డి వంటి వారిని అలాగే, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి ఆధునిక కమర్షియల్ దర్శకులను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Latest News