|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:56 AM
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, నిర్మాత సుస్మిత కొణిదెల తన తండ్రిపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. చిరంజీవి తెలిపిన పుట్టినరోజు శుభాకాంక్షలకు బదులిస్తూ ఆమె పంచుకున్న ఈ సందేశం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది."డాడీ, థ్యాంక్యూ. రెండేళ్ల పాపగా మీ చేయి పట్టుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నేను, ఇప్పుడు మీ నిర్మాతగా మారడం వరకు నా జీవితం ఓ అద్భుతమైన వరం. నాకు ఒకే వ్యక్తిలో తండ్రి, గురువు, నిజ జీవిత హీరో, మెగాస్టార్.. అన్నీ మీరే. ఇంతకంటే నేనేం కోరుకోగలను? మీ విషెస్‌కి థ్యాంక్యూ. ఎప్పుడూ మీలాగే ఉన్నందుకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్వేస్" అంటూ సుస్మిత తన పోస్టులో పేర్కొన్నారు.
Latest News