|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:42 PM
తనపై వచ్చిన వివాదంపై నటి సాయి పల్లవి స్పందించారు. తాను ఎప్పుడూ ఏ భాషను చిన్నచూపు చూడలేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో తాను కేవలం తన మాతృభాష తమిళమని మాత్రమే చెప్పానని, కానీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. మీడియాలో వక్రీకరించిన వార్తల వల్ల తాను మలయాళ భాషను ద్వేషిస్తున్నాననే అపోహలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్ని భాషలను గౌరవిస్తానని, తన మాటలను తప్పుగా ప్రచారం చేయడం బాధాకరమని పల్లవి పేర్కొన్నారు.
Latest News