|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 04:13 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న 'రాకా' సినిమా గురించి కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ తన ఆప్త మిత్రుడని, 'రాజా రాణి' సినిమా తర్వాత బన్నీ తనని, అట్లీని అభినందించారని గుర్తు చేసుకున్నారు. 'రాకా' సినిమాలో తనకు ఏదైనా పాత్ర ఉందా అని అట్లీని అడిగితే ఆయన నవ్వుతూ దాటవేశారని, ప్రాజెక్ట్ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారని ఆర్య తెలిపారు. అల్లు అర్జున్-ఆర్యల మధ్య 'వరుడు' సినిమాతో స్నేహం మొదలైంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News