|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 02:51 PM
హైదరాబాద్‌లోని యుసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మార్చి 15, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. పవన్ కళ్యాణ్, ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్న ఈ వేడుకను మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు పండగలా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా స్పెషల్ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉంది. కాగా, మార్చి 19న ఉగాది కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఈవెంట్‌లా కాకుండా, మెగా అభిమానులకు ఒక భారీ పండగలా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రౌండ్స్‌లో స్టేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన సాంగ్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ మ్యూజిక్ కు ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగం తోడైతే ఇక అంచనాలు మామూలుగా ఉండవు.
Latest News