|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 01:10 PM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి పనులు, రిసెప్షన్లతో బిజీగా గడిపిన ఈ జంట, ప్రస్తుతం కాస్త రిలాక్స్ అవుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన ఒక సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొత్త జంట విజయ్-రష్మికతో కలిసి ఆనంద్ దేవరకొండ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ నుంచి విడుదలైన ‘సంచారమే’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాప్యులర్ అయింది. ఈ పాటకు సంబంధించిన రీల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ట్రెండీ పాటకు అన్న విజయ్, వదిన రష్మికతో కలిసి ఆనంద్ సరదాగా స్టెప్పులు వేశాడు. ముగ్గురూ కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Latest News