|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:49 AM
వేటూరి రచయితగా వచ్చిన తరువాత తెలుగు పాటను అటు అందంగానూ .. ఇటు వేగంగాను పరిగెత్తించారు. అలాంటి వేటూరిని గురించి, ఆయన తనయుడు 'రవి ప్రకాశ్' మాట్లాడుతూ.... 'మొదటి నుంచి కూడా నాన్నగారికి తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. అదే ఆయనను పాటల దిశగా నడిపించింది' అని అన్నారు. "మా నాన్నగారి శైలి అంటే రామారావుగారికి చాలా ఇష్టం. 'గులే బకావళి' సినిమా పాటలను నాన్నగారితో రాయించాలని రామారావుగారు భావించారు. అయితే ఉద్యోగానికి ఎక్కువ రోజులు సెలవు పెట్టడానికి నాన్నగారు ఆలోచన చేయడం వలన, ఆ అవకాశాన్ని అందుకోలేకపోయారు. ఆ తరువాత కూడా రామారావు గారు ఎప్పటికప్పుడు నాన్నగారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. సినిమా పాటల రచయితలలో అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకునే స్థాయికి నాన్నగారు వెళ్లిపోయారు" అని చెప్పారు.
Latest News