|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 02:31 PM
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదల నేపథ్యంలో ఒక ప్రభాస్ అభిమాని మహేష్ బాబును ఉద్దేశించి చేసిన ట్వీట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ 'తథాస్తు' అని స్పందించడంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హరీష్ శంకర్ స్పందిస్తూ తాను బిజీగా ఉండటం వల్ల ట్వీట్‌ను పూర్తిగా చూడకుండానే స్పందించి, వెంటనే తొలగించానని, మహేష్ బాబుపై తనకు ఎంతో గౌరవం ఉందని, తన పొరపాటుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.సోషల్ మీడియాలో హరీశ్ శంకర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు, నెటిజన్‌లకు రిప్లైలు ఇస్తూ ఉంటారు. ఈనేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్.. మహేశ్ రికార్డుల గురించి, ఆయన రానున్న చిత్రంపై నెగెటివ్‌గా పోస్ట్ పెట్టారు. దానికి హరీశ్‌శంకర్ అనుకోకుండా రిప్లై పెట్టారు.
Latest News