|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:11 PM
"రాజశేఖర్ గోలీల వ్యాపారంతో ఎంత సంపాదిస్తున్నారో తెలుసా. బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశాల్లో గోలీలను విక్రయిస్తూ రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సంపాదిస్తున్నారు" అంటూ చాలాకాలంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో నటుడు రాజశేఖర్ మాట్లాడుతూ, తనకు అలాంటి ఫ్యాక్టరీ ఏదీ లేదని స్పష్టం చేశారు. గోలీల ఫ్యాక్టరీ అంటూ ట్రెండ్ నడుస్తోందని, కొంతమంది ఇది నిజమేనని అనుకుంటున్నారని తెలిపారు.నిజానికి తనకు ఎలాంటి గోలీల ఫ్యాక్టరీ లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో చూసి తెలిసిన వాళ్లు కూడా 'నిజమా, గోలీల ఫ్యాక్టరీ ఉందా' అని అడిగారని గుర్తు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నఆ వీడియోను చూసి, నాకు నేనే... నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది, కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదిస్తున్నానని సరదాగా నవ్వుకున్నానని తెలిపారు.
Latest News