|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 04:17 PM
ఒకప్పటి స్టార్ హీరోయిన్ హన్సికా మొత్వాని తన నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలికింది. తన భర్త సోహైల్ నుంచి విడాకులు తీసుకుంది. 15 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసిన హన్సికా, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ సంపాదించింది. తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2022లో పెళ్లి చేసుకుంది. సోహైల్‌కు అప్పటికే రింకీ బజాన్ అనే యువతిని పెళ్లాడాడు. ఆ పెళ్లికి హన్సికా కూడా వెళ్లింది. కొంత కాలానే వారిద్దరు విడిపోవడంతో, సోహైల్‌కు హన్సికా దగ్గరైంది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత, సోహైల్‌ను పెళ్లాడుతున్నట్లు ప్రకటించింది. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే, గతేడాది నుంచి సోహైల్ హన్సికాలు విడిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి.
Latest News