|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 01:26 PM
బాలీవుడ్ ఫిట్‌నెస్ బ్యూటీ మలైకా అరోరా ఈసారి తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన మోడల్, నటుడు సోరబ్ బేడితో డేటింగ్‌లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఒక పార్టీలో వీరిద్దరూ కలిసి డాన్స్ చేయడం, హగ్ చేసుకుని ఫొటోలు దిగడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అయితే, ఈ వార్తలపై సోరబ్ బేడి తాజాగా స్పందిస్తూ.. ఆ రూమర్స్‌ను పూర్తిగా కొట్టిపడేశాడు. మలైకాతో తనకున్న బంధం కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశాడు.మోడలింగ్ రోజుల్లో తన మెంటార్లయిన డెల్నాజ్ దారువాలా, వాహ్బిజ్ మెహతా ద్వారా మలైకాతో పరిచయం ఏర్పడిందని, గత నాలుగేళ్లుగా తామంతా ఒకే ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నామని సోరబ్ తెలిపాడు. తాను మలైకాతో పార్టీలకు వెళ్లడం ఇదే మొదటిసారి కాదని... గతంలో కూడా ఆమెతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశానని చెప్పాడు. అప్పుడు తాను ఫేమస్ కాకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదని... ఇప్పుడు తన ముఖం అందరికీ తెలియడంతో వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డాడు.
Latest News