|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:16 PM
అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 19వ తేదీ నుంచి రెండు భారీ చిత్రాలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ థియేటర్‌లో తొలి ప్రదర్శనలుగా రెండు క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాలను ఈ నెల 19 నుంచి ప్రదర్శించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగా అంటే 18న ‘ధురంధర్ 2’ పెయిడ్ ప్రివ్యూలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
Latest News