|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:14 PM
సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కీరవాణి కుమారుడు కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు, టాలీవుడ్ లో బాలనటిగా అడుగుపెట్టి ప్రముఖ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది.వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి 'మసూద', 'బలగం' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది.ప్రస్తుతం రెండు కుటుంబాల్లో వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Latest News