|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 03:06 PM
మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల సంఘం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు లేఖ రాసింది. రెంట్ విధానం బదులు లాభాల్లో వాటా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత విధానంతో నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగిల్ స్క్రీన్‌లు మూతపడితే తక్కువ టికెట్ ధరలతో సినిమాలు చూసే అవకాశాలు తగ్గి, చిన్న సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Latest News