|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 04:00 PM
మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ మాట్లాడరు కానీ, జనాభాలో మాత్రం మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. పిల్లలను ఒక ఫ్యాక్టరీలా కనేస్తున్నారు, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు. కనే ముందే సరైన ప్లాన్ ఉండాలి కదా" అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక బిడ్డను పెంచి, చదివించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అందుకే ఇంకొకరిని పోషించే స్తోమత ఉన్నప్పుడే పిల్లలను కనాలని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ సూచించారు.చాలామంది తమ పిల్లల చదువుల కోసం లేదా ఆర్థిక సాయం కోసం తన దగ్గరకు వస్తుంటారని చెప్పిన వరలక్ష్మి... "ఆ పిల్లలకు నేనేమైనా జన్మనిచ్చానా? మీ తప్పులకు నేను ఎందుకు బాధ్యత వహించాలి?" అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆమెకు ప్రియమణి, మంచు లక్ష్మి కూడా మద్దతుగా నిలిచారు. జనాభా నియంత్రణకు, ఆర్థిక స్థోమతను పిల్లలను కనడానికి ముడిపెడుతూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Latest News