|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 04:12 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వేడిని పుట్టిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తుతూనే, చిత్ర పరిశ్రమలో ఆయన ఎదుర్కొంటున్న అసూయను వర్మ బయటపెట్టారు. ఆదిత్య ధర్, ఆయన భార్య, నటి యామీ గౌతమ్‌ల పతనం కోసం పరిశ్రమ మొత్తం వేచి చూస్తోందని వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసినప్పటి నుండి తాను ఆయనకు అభిమానిని అయిపోయానని వర్మ చెప్పుకొచ్చారు.ఆదిత్య ధర్ సినిమా మేకింగ్‌లో సరికొత్త పద్ధతులను, కథ చెప్పే తీరులో కొత్త గ్రామర్‌ను ప్రవేశపెట్టారని వర్మ కొనియాడారు. ఆయన ప్రభావం ఎంతలా ఉందంటే, టాలీవుడ్‌లో రాబోయే పలు భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు ‘ధురంధర్’ మేకింగ్ స్టైల్‌ను చూసి తమ షూటింగ్‌లను ఆపేసి మరీ రీ-షూటింగ్ చేసుకుంటున్నాయని వెల్లడించారు.
Latest News