|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:55 AM
సినీ నటి అనసూయ భరద్వాజ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనసూయ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.ఏపీలోని కడప జిల్లా పులివెందుల పరిధిలోని జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ నగరానికి వచ్చి గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో ఉంటున్నాడు. అనసూయపై ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియో, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Latest News