|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:15 PM
అనుపమ పరమేశ్వరన్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే తమిళ 'లాక్ డౌన్'. లైకా ప్రోకడక్షన్స్ వారు నిర్మించిన సినిమా ఇది. జీవా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. అయితే 'లాక్ డౌన్' నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినందువలన, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అనుపమా పరమేశ్వరన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. బలమైన కథలను .. బరువైన పాత్రలను పోషించిన అనుభవం తనకి ఉంది. అందువలన ఆమె నటన ఆకట్టుకుంటుంది. అనుపమ పాత్ర తప్ప ఆమె కనిపించదు. ఇక ఆమె తల్లి పాత్రలో నిరోషా .. ఇతర పాత్రలను ధరించిన ఆర్టిస్టులంతా బాగా చేశారు.శక్తివేల్ ఫొటోగ్రఫీ .. రఘునాథన్ నేపథ్య సంగీతం .. సాబూ జోసెఫ్ ఎడిటింగ్ పనితనం బాగుంది.
Latest News