|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:42 PM
మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం చేసుకున్నానని, దీనికి 'లవ్ జిహాద్' కోణాన్ని ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు. పెళ్లి అనంతరం ఇవాళ కేరళలో తన భర్తతో కలిసి ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు.కేరళలోని అరుమనూర్ ఆలయంలో నిన్న ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నా పెళ్లి హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. ఇది లవ్ జిహాద్ కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ప్రతీ మతాన్ని సమానంగా చూస్తాను" అని తెలిపారు. తామిద్దరూ తమ తమ మతాలను మార్చుకోలేదని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ వివాహంపై జరుగుతున్న ప్రచారానికి వారు తెరదించారు.
Latest News