|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 11:51 AM
పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను 'ఫీమేల్ ఓజీ' అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఒక పాత్ర కోసం ఎంతైనా కష్టపడే తత్వం శ్రీయా రెడ్డి సొంతం. కేవలం నటనకే పరిమితం కాకుండా అత్యంత కఠినమైన ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విద్యలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావించే 'ఉరిమి'ని అలవోకగా తిప్పుతూ ఆమె చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ఆమె వేగం, ఏకాగ్రత చూస్తుంటే నిజంగానే ఓ యుద్ధ వీరనారిలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.శ్రీయా రెడ్డి ఎప్పుడూ విభిన్నమైన పాత్రలనే ఎంచుకున్నారు. 'పొగరు' సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది. ఇటీవల 'సుఝల్' వెబ్ సిరీస్‌లోనూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రభాస్ నటించిన 'సలార్ పార్ట్ 1'లో రాధా రమ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ 'సలార్ 2: శౌర్యాంగ పర్వం'లో కూడా ఆమె కీలక పాత్రలో నటించనున్నారు.
Latest News