|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 12:16 PM
అక్కినేని నాగార్జున తన ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమా గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రానప్పటికీ, 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది అని సమాచారం. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా దర్శకుడు కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నాగార్జునను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కార్తీక్ తెలిపారు. గతంలో నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిన శివ, రక్షకుడు వంటి చిత్రాల్లో కనిపించిన పవర్‌ఫుల్, స్టైలిష్ అవతారంలో ఆయన మరోసారి దర్శనమివ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే కథానుసారం ఈ సినిమాలో నాగార్జున ఏకంగా మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన లుక్ అభిమానులకు పండగలా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు.
Latest News