|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 03:41 PM
హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ధురంధర్ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టరో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలను ఆకాశానికి చేర్చిన ఈ చిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఊపిన బాంబే రాకర్స్ పాప్యులర్ సాంగ్ 'ఆరి ఆరి'కి ఆధునిక హంగులు అద్ది, కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఈ పాట సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ ఈ క్లాసిక్ హిట్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీట్స్‌తో రీమిక్స్ చేశారు. రణ్‌వీర్ సింగ్ తనదైన ఎనర్జీ, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటకు ప్రాణం పోశాడు. ఇప్పటికే 310 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసిన ట్రైలర్ తర్వాత, ఈ పాట విడుదలతో సినిమా ప్రమోషన్లు మరో స్థాయికి చేరాయి. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News