|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:36 PM
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించి, రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో రణ్‌వీర్ సింగ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు 'ధురంధర్ 2' మార్చి 19న విడుదల కానుంది. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు 'పుష్ప 2' రికార్డులను కూడా ఇది తిరగరాస్తుందని అంచనా వేస్తున్నాయి.ఇండియాలో ధురంధర్ 2 ప్రీమియర్ షోల కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి అంటే మూవీకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఈ టికెట్ల అమ్మకాల ద్వారా కేవలం ఇండియాలోనే రూ.24.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. గతేడాది పవన్ కల్యాణ్ మూవీ ఓజీ ప్రీమియర్స్ రికార్డు (రూ.25 కోట్లు)ను ధురంధర్ 2 అందుకునేలా కనిపిస్తోంది.విదేశాల్లో ధురంధర్ 2 ప్రీమియర్ షోలతో పాటు మిగతా రెగ్యులర్ షోలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ య్యాయి. దీంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఈ మూవీ డామినెన్స్ మూమూలుగా లేదు. ఈ చిత్రం ఇప్పటికే అమెరికా, కెనడాలో కలెక్షన్ రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో ఫస్ట్ వీకెండ్ లోనే 3 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరేందుకు ధురంధర్ 2 రంగం సిద్ధం చేసుకుంది.
Latest News