|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:40 PM
హీరో అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'డకాయిట్'. ఈ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం ఆధ్యాత్మికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన ఈ జంట, తమ సినిమా విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా అడివి శేష్ మాట్లాడుతూ... "ప్రతి సినిమా ఒక నమ్మకంతో చేసే ప్రయత్నమే. ఏళ్ల తరబడి కష్టపడి ఒక సినిమాను ప్రేక్షకుల చేతిలో పెడతాం. తిరుపతిలో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం సరైనదిగా అనిపించింది. ప్రమోషన్ల హడావుడిలోకి అడుగుపెట్టే ముందు కృతజ్ఞతతో ఆశీస్సులు తీసుకోవడం మాకు ముఖ్యం" అని తెలిపారు. అంతకుముందు తన మరో సినిమా విడుదల సందర్భంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని కూడా శేష్ దర్శించుకున్నారు.
Latest News