|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:28 PM
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గతేడాది తాను ఎదుర్కొన్న తీవ్ర అనారోగ్యం గురించి తొలిసారిగా పెదవి విప్పారు. ఆ సమయంలో తాను వాసన చూసే శక్తిని, రుచిని పూర్తిగా కోల్పోయానని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కొచ్చిలో తన స్వచ్ఛంద సంస్థ 'కేర్ అండ్ షేర్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్' 16వ వార్షికోత్సవంలో ఆయన ఈ విషయం వెల్లడించారు."చాలా కాలం పాటు నాకు వాసన, రుచి తెలియలేదు. ఆ శక్తులు కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాను" అని మమ్ముట్టి వివరించారు. ఈ సందర్భంగా వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు అందించే 'కాథోడు కాథోరం' అనే ప్రాజెక్ట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. వినగలగడం దేవుడిచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు.గత ఏడాది ఆరంభంలో మమ్ముట్టి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారని వార్తలు రాగా, ఆయన పీఆర్ టీమ్ వాటిని ఖండించింది. ఇప్పుడు స్వయంగా మమ్ముట్టి తన అనారోగ్య అనుభవాన్ని పంచుకోవడంతో ఆ వదంతులకు తెరపడింది.
Latest News