|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 03:39 PM
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అనారోగ్యంపై వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించారు.మలయాళ చిత్రసీమలో లెజెండరీ నటుడు మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న కెరీర్‌లో 400కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన వయసు పెరిగినా నటనలో మాత్రం యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ ముందుకు సాగుతున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం, లోతైన పాత్రలు. డైలాగ్ డెలివరీ ఇవన్నీ ఆయన్ని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే మమ్ముట్టి గతేడాది కొన్ని నెలల పాటు షూటింగ్‌లకు దూరంగా ఉండటంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. గత ఏడాది జూన్ లో అనారోగ్యానికి గురై నాలుగు నెలల పాటు సినిమాలకు విరామం తీసుకున్న ఆయన, ఆ సమయంలో రుచి, వాసన శక్తిని కోల్పోయానని, ఇప్పుడిప్పుడే తిరిగి పొందుతున్నానని తెలిపారు. కంటి చూపు, వినికిడి, శ్వాసతో పాటు వాసనను గుర్తించగలగడం గొప్ప వరమని, వాటి విలువ కోల్పోయినప్పుడే తెలుస్తుందని భావోద్వేగంగా మాట్లాడారు.
Latest News