|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:18 PM
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కు రూ.10 కోట్లు ఇవ్వాలంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. అమెరికాలో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ నుంచి రణ్‌వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ ఖాతాకు బెదిరింపు వాయిస్ నోట్ వచ్చింది. దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అమెరికా అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులకు ఇటీవల వరుస బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. తనను తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి బాలీవుడ్ ప్రముఖులకు ఈ బెదిరింపు సందేశం పంపించాడు. తాను కోరినంత డబ్బులు ఇవ్వాలని లేదంటే సిబ్బందిని హత్య చేస్తానని బెదిరించాడు. మీ మేనేజర్ నుంచి మీ వద్ద పని చేసే ప్రతి ఒక్కరి వివరాలు మాకు తెలుసని, వారు తమ కుటుంబాలతో ఎక్కడ నివసిస్తున్నారో కూడా తెలుసని, వాళ్లకు ఏమీ కాకముందే మీరు డిమాండ్లకు అంగీకరించాలని ఆ వాయిస్ నోట్‌లో పేర్కొన్నాడు.
Latest News