|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 11:21 AM
బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి, దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటి నిత్యామీనన్ తనదైన ముద్ర వేశారు. మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం వంటి పలు భాషల్లో నటించిన ఆమె, పాత్రల విషయంలో ఎంతో సెలెక్టివ్‌గా ఉంటారు. తెలుగులో 15 ఏళ్ల నట ప్రస్థానం కొనసాగించిన నిత్యామీనన్, ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, కేయూరి ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌లో బలమైన భావోద్వేగ మార్పును తీసుకురావడానికి, స్క్రిప్ట్‌కు, పాత్రల లోతుకు ప్రాధాన్యతనిచ్చే సినిమాలను నిర్మించాలని ఆమె భావిస్తున్నారు.`ఘాటీ` లాంటి చిత్రంలో అత్యాచారానికి గురైన బాధితరాలి పాత్రలో నటించిందంటే? నిత్యామీనన్ పాత్రకు కనెక్ట్ అయితే ఎలా ఉంటుందని నిరూపించింది. అలాంటి పాత్ర పోషించాలంటే గట్స్ ఉండాలి. అవన్నీ తనలో నిండుగా ఉన్నాయని ప్రూవ్ చేసింది. `అలా మొదలైంది` నుంచి `భీమ్లా నాయక్` వరకూ నిత్యా మీనన్ ఎంతో సెలక్టివ్ గానే ప్రయాణాన్ని కొనసాగించింది.
Latest News