|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 07:03 PM
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహ వేడుక ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనుంది. ఈ వేడుక కోసం ఇప్పటికే దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వంటి సినీ ప్రముఖులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ వివాహం నగరానికి దూరంగా ఉన్న ‘మెమెంటోస్ బై ఐటిసి హోటల్స్’లో అత్యంత ప్రైవేటుగా జరగనుంది. కేవలం 100 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆటపాటలతో సందడి మొదలవ్వగా, మంగళవారం సాయంత్రం మెహందీ, ఫిబ్రవరి 25న హల్దీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి.అందుకు గాను 26న జరిగే వివాహానికి కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని, రెండు కుటుంబాల నుంచి చెరో 100 మంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకల కోసం డచ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పూలతో ప్యాలెస్‌ను అలంకరించనున్నారని, ప్రముఖ డిజైనర్లతో వెడ్డింగ్ అవుట్‌ఫిట్స్ రూపొందిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
Latest News