|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 10:41 AM
ప్రస్తుతం టాలీవుడ్‌లో యువ నటి భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్‌లో ఒక సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. తన అందంతో, ప్రతిభతో ఆకట్టుకుంటున్న ఆమె, ఇప్పుడు అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తోంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, మే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా భాగ్యశ్రీకి, అఖిల్‌కు లైఫ్ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.అఖిల్ అక్కినేనికి కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం. ఇటు హీరోకి, అటు హీరోయిన్ కి ఇద్దరికీ ‘లెనిన్’ సినిమా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా భాగ్యశ్రీ గ్లామర్ కు తోడు, సరైన కథ పడితే ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందం, ప్రతిభ ఉన్న భాగ్యశ్రీ బోర్సేకు ఈ వేసవిలో అదృష్టం ఎలా కలిసివస్తుందో చూడాలి. మరి అఖిల్ – భాగ్యశ్రీ జోడీ వెండితెరపై ఎలాంటి మేజిక్ చేస్తుందో తెలియాలంటే మే వరకు వేచి చూడాల్సిందే.
Latest News