|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:53 PM
దివంగత నటి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా ఆమె కుమారుడు, ప్రముఖ నటుడు నరేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తన జీవితంలో అమ్మ ప్రభావం ఎలాంటిదో వివరిస్తూ ఆయన రాసిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి."అమ్మ, కళావాహిని డా. విజయనిర్మల గారి జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటున్నాను. ఆమె ప్రేమ నా బలం, ఆమె మౌనం నాకు మార్గదర్శకం, ఆమె జీవితం ఒక నిశ్శబ్ద ఆశీర్వాదం. ఆమె ఆత్మీయత నా ప్రతి క్షణాన్ని తీర్చిదిద్దింది. ఆమె విలువలు నా ప్రతి అడుగుకు రూపం కల్పించాయి. ఆమె ఆత్మ కాలానికి, మాటలకు అతీతంగా నాతోనే నడుస్తూ ఉంటుంది" అని నరేశ్ పేర్కొన్నారు.
Latest News