|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 03:47 PM
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష స్పందించారు. ఇటీవల తన ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమె తెలిపారు. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని త్రిష స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.నటన ద్వారానే తానేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు గానీ, ఇలాంటి పొలిటికల్ కామెంట్స్ వల్ల కాదు. సంబంధంలేని విషయాల్లోకి నా క్లయింట్‌ను లాగొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.ఈ వివాదంపై రాజకీయ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. డీఎంకే ఎంపీ కనిమొళి, ఇతర మహిళా సంఘాల నేతలు నైనార్ నాగేంద్రన్ తీరును తప్పుబట్టారు. మహిళల పట్ల ఇలాంటి 'గుటర్ పాలిటిక్స్' (నీచ రాజకీయాలు) చేయడం బీజేపీ సంస్కృతికి నిదర్శనమని వారు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కూడా త్రిషకు మద్దతుగా నిలుస్తూ, నాగేంద్రన్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Latest News