|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:59 PM
తెలుగు ప్రేక్షకులకి 'బిగ్ బాస్' రియాలిటీ షో సుపరిచితమే. అయితే అంతకు మించిన రేటింగ్స్ సాధించిన 'MTV రోడీస్' తరహాలో ఒక కొత్త రియాలిటీ షో త్వరలో స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానుంది. ఈ షోలో ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ టాస్కులు మాత్రం బిగ్ బాస్ కంటే కఠినంగా ఉంటాయి. ఫిజికల్, మైండ్ గేమ్స్, రేసింగ్ వంటి అనేక టాస్కులు వివిధ లొకేషన్లలో నిర్వహిస్తారు. నలుగురు మెంటర్స్, వారి టీమ్స్ మధ్య పోటీలు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్‌కు ఓటింగ్ ఉంటుంది, ప్రేక్షకుల ఆదరణ పొందినవారే కొనసాగుతారు. మెంటర్స్ గా బిగ్ బాస్ గత సీజన్ కంటెస్టెంట్స్ కళ్యాణ్, తనూజ వ్యవహరించనున్నారని టాక్. హోస్ట్ గా ఒక యంగ్ హీరో ఉండబోతున్నారని సమాచారం. 'BB జోడి 2' పూర్తయ్యాక ఈ షో మొదలయ్యే అవకాశాలున్నాయి.ఇవన్నీ వివిధ లొకేషన్స్ లో నిర్వహిస్తుంటారు. ఎండల్లో, మంచు పర్వతాల మధ్యలో కూడా టాస్కులు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఈ గేమ్ షోలో నలుగురు మెంటర్స్ ఉంటారు. నలుగురి టీమ్స్ లోను చెరో 8 మంది కంటెస్టెంట్స్, లేదా 10 మంది కంటెస్టెంట్స్ ఉంటారు. వీరి మధ్య టాస్కులు నిర్వహిస్తారు. ప్రతీ ఎపిసోడ్ కి కూడా ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆడియన్స్ మెచ్చిన వాళ్ళే ఈ షోలో కొనసాగుతారు. ఒకవేళ ఒక మెంటర్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయితే, వారితో పాటు మెంటర్ కూడా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. బీబత్సమైన గొడవలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ కంటే చాలా ఆసక్తికరంగా ఈ షో ఉంటుంది. అయితే ఇక్కడ మెంటర్స్ గా ఎవరు వ్యవహరిస్తారు, హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Latest News