|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:13 PM
యంగ్ హీరో అడివి శేష్ తన తదుపరి చిత్రం 'డెకాయిట్' ప్రమోషన్లను వినూత్నంగా ప్రారంభించాడు. ఏప్రిల్‌లో సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ, ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, కథ ప్రారంభ దశ నుంచే తాను భాగస్వామిని అయ్యానని తెలిపాడు.ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని తొలి పాట 'రుబరూ'ను విడుదల చేశారు. అడివి శేష్, కథానాయిక మృణాల్ ఠాకూర్‌పై ఈ పాటను చిత్రీకరించారు. ఈ రొమాంటిక్ గీతం సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తుందని అడివి శేష్ అన్నాడు. "ప్రేక్షకులతో ఈ కథను పంచుకునే ముందు, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఏప్రిల్‌లో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
Latest News